అమెరికా కాలిఫోర్నియా తొలి తెలుగు జడ్జి: ఎవరీ జయబాడిగ..!

Jaya Badiga: జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

Update: 2024-05-21 09:04 GMT

అమెరికా కాలిఫోర్నియా తొలి తెలుగు జడ్జి: ఎవరీ జయబాడిగ..!

Jaya Badiga: జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు.2022 నుండి ఆమె ఇదే కోర్టులో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కాలిఫోర్నియాలో జడ్జిగా అపాయింటైన వారిలో జయబాడిగా మొదటివారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన జయబాడిగ స్వస్థలం.చిన్నతనంలో విజయవాడలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. 1991 నుండి 1994 లో హైద్రాబాద్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఆమె అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ, శాంటాక్లారా యూనివర్శిటీలో లా పట్టా అందుకున్నారు.2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షను జయ బాడిగ పూర్తి చేశారు. పదేళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగారు.2022 నుండి శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

జయ బాడిగ పేరేంట్స్

ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కూతురే జయ బాడిగ. జయ తండ్రి రామకృష్ణ 2004 నుండి 2009 వరకు మచిలీపట్టణం ఎంపీగా పనిచేశారు. రామకృష్ణ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. రామకృష్ణ మూడో కూతురే జయ.

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు. సాఫ్ట్ వేర్ రంగంతో పాటు ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన కొందరు అక్కడే స్థిరపడ్డారు. మరికొందరు కొంత కాలం పాటు పనిచేసి స్వదేశానికి తిరిగి వస్తున్నారు.

Tags:    

Similar News