బడ్జెట్ లో ఆర్ధిక వాస్తవికత లోపించింది : జనసేన

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మంగళవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై జనసేన పార్టీ స్పందించింది. ఈ బడ్జెట్ ప్రజలను మరోసారి ఆకర్షించడానికి రూపొందించారు తప్ప ప్రజల అభివృద్ధిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోలేదని జనసేన పార్టీ విమర్శించింది

Update: 2020-06-16 17:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మంగళవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై జనసేన పార్టీ స్పందించింది. ఈ బడ్జెట్ ప్రజలను మరోసారి ఆకర్షించడానికి రూపొందించారు తప్ప ప్రజల అభివృద్ధిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోలేదని జనసేన పార్టీ విమర్శించింది. బడ్జెట్ విషయంలో కనికట్టు చేశారని.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చిన్న ప్రయత్నం కూడా జరగలేదని అభిప్రాయపడింది. బడ్జెట్లో ఆర్ధిక వాస్తవికత, స్పష్టత లోపించిందని..అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిదని విమర్శించింది.

కీలకమైన వ్యవసాయం, ఇరిగేషన్‌, గృహనిర్మాణాల, వైద్య ఆరోగ్యం లాంటి శాఖల బడ్జెట్‌ కు కోతలు విధించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అలాగే రాష్ట్రానికి కొత్తగా ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి? ఆంధ్రప్రదేశ్‌ లోని యువకుల కోసం ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు? అనే దానిపై ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించింది.


Tags:    

Similar News