ఏపీ లో మూడు రాజధానుల నిర్మాణానికి మద్దతిస్తా: జనసేన ఎమ్మెల్యే రాపాక

గతంలో మాదిరిగా హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చిన పరిస్థితుల దృష్ట్యా మరలా అటువంటి పరిస్థితి ఎదురుకాకూడదే ఉద్దేశంతో...

Update: 2019-12-19 11:00 GMT
రాపాక వరప్రసాద్

మలికిపురం: గతంలో మాదిరిగా హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చిన పరిస్థితుల దృష్ట్యా మరలా అటువంటి పరిస్థితి ఎదురుకాకూడదే ఉద్దేశంతో... జగన్ ప్రభుత్వం చేపడతామని చెప్పిన మూడు రాజధానిల ఫార్ములా మంచిదేనని ఎమ్మెల్యే రాపాక అభిప్రాయపడ్డారు. పట్టణంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకుల సమావేశంలో రాపాక పాల్గొన్నారు. మూడు రాజధానుల వలన రాష్ట్రం అంతా అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని, తాను వ్యక్తిగతంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు.

అలానే కొద్ది రోజులలో తమ పార్టీ పాలిట బ్యూరో కమిటీ అమరావతిలో పర్యటించనున్నారని, దీని ద్వారా రైతు సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. గత కొద్దిరోజులగా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిని ఎవ్వరూ నమ్మవద్దని, పార్టీతో సత్సంబందాలుతోనే ఉన్నాననన్నారు. పార్టీలో విభేదాలు లేవని, పార్టీ మారే ఉద్దేశ్యం కూడా అసలు లేదని స్పష్టం చేశారు. 



Tags:    

Similar News