సీఎం జగన్ ఫొటోకు మరోసారి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే రాపాక

Update: 2019-12-21 11:26 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోకు తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పాలాభిషేకం చేశారు. జగన్ జన్మదినం సందర్బంగా రాజోలులో ఏర్పాటు చేసిన వేడుకలకు రాపాక హాజరయ్యారు. ఈ సందర్బంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. దాంతో అక్కడున్న వైసీపీ నేతలంతా అవాక్కయ్యారు. ఇటు రాపాక చర్యపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా రాపాక వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో ఆయన పార్టీ మారడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అనుకుంటున్నారు. కాగా గతంలో కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రకటించినందుకు సీఎం జగన్‌ను అభినందిస్తూ ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ర్యాలీ చేసి..

సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఆటోడ్రైవర్లతో కలిసి సభలో పాల్గొని.. అనంతరం జగన్ ఫోటోకు అప్పట్లో పాలాభిషేకం చేశారు. తాజాగా మరోసారి ఇలా చేయడంపై పార్టీలో ఆయన వ్యవహారం చర్చనీయాంశయం అయింది. జనసేన పార్టీ ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వంతో పోరాటం సాగిస్తుంటే. ఎమ్మెల్యే రాపాక మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో మార్పు రావాలని సూచించారు. దాంతో ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జనసేన అధిష్ఠానం.. రాపాకకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేదు.సీఎం జగన్ ఫొటోకు మరోసారి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే రాపాక 

Tags:    

Similar News