Janasena: ప్రభుత్వంపై డిజిటల్ పోరుకు సిద్ధమైన జనసేన
Janasena: రేపు ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా క్యాంపెయిన్
Janasena: ప్రభుత్వంపై డిజిటల్ పోరుకు సిద్ధమైన జనసేన
Janasena: ఏపీలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలు పైచేయి కోసం అడుగులు వేస్తున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ టార్గెట్‌గా ఘాటు విమర్శలతో హీట్ పుట్టిస్తున్న జనసేన పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. జగనన్న కాలనీలను సందర్శించేందుకు పార్టీ కేడర్‌కు ఆదేశాలిచ్చింది.
జగనన్న కాలనీల ముసుగులో వైసీపీ ప్రభుత్వం అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతోందని జనసేన ఆరోపించింది. గురువారం పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, వీరమహిళల ప్రాంతీయ కమిటీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న కాలనీల పేరిట నిరుపయోగంగా ఉన్న భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ పార్టీ నాయకులు ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ఆరోపించారు. పలుచోట్ల చెరువులను కూడా ఆక్రమించి వైసీపీ నేతలు సొమ్ము చేసుకున్నారన్నారు.
ఇక ఇదే అంశాన్ని సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది జనసేన పార్టీ. వర్షాకాలంలో జగనన్న కాలనీల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టేలా రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలనీల సందర్శనకు పిలుపునిచ్చింది. రేపు ఉదయం 10 గంటల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తమతమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు, సందర్శించి అక్కడ పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.