అనంతపురంలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan: రైతు భరోసా యాత్ర ప్రారంభించనున్న జనసేనాని
అనంతపురంలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అనంతపురం జిల్లాలో రైతు బరోసాయాత్ర ప్రారంభించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్ పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి కొత్త చెరువు, ధర్మవరం, గొట్లూరు, బత్తలపల్లిలో కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించనున్నారు. జిల్లాలోని 28 మంది కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు. అనంతరం మన్నీల గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.