ఆంగ్ల మీడియం విద్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్

Update: 2019-11-10 06:17 GMT

ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకు ఆంగ్ల మాద్యమాన్ని తప్పనిసరి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇది తెలుగుకు ముప్పని వ్యాఖ్యానిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. తెలుగు మాధ్యమాన్ని పాఠశాలలలో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ,ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. భాష మరియు సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వైసీపీ నాయకత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఈ సందర్బంగా 2017 లో హైదరాబాద్‌లో జరిగిన 'తెలుగు మహాసభలు' పుస్తకం చూడాలన్నారు.

అలాగే పలు ట్వీట్లలో తెలుగుకు సంబంధించి ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాలను పోస్ట్ చేశారు. అయితే పవన్ కు వైసీపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురవుతోంది. ఆయన తన కొడుకుని ఓక్రిడ్జ్ స్కూల్ లో చేర్పించినప్పుడు పవన్ మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వచ్చిన కారణంగానే ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో తెలుగు సబ్జెక్టును యధాతధంగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై విమర్శలు చేసేవాళ్ళు తమ పిల్లల్ని తెలుగు మీడియంలోనే చదివిస్తున్నారా? అని ఎదురు ప్రశ్నిస్తోంది. 

Tags:    

Similar News