మీ త్యాగాన్ని మరువలేం: పవన్ ట్వీట్

Update: 2020-06-17 03:41 GMT
Pawan Kalyan (File Photo)

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మీ త్యాగాలను మరువలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా రెండు దేశాల మద్య ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వవన్ ఈ ట్వీట్ చేశారు.

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో ముగ్గరు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు వీరులకి తన తరపున, జనసేన తరపున నివాళి ఘటిస్తున్నానన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదన్నారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ వేడుకున్నారు.


Tags:    

Similar News