Pawan Kalyan: ఏపీలో రోడ్ల దుస్థితిపై మండిపడ్డ జనసేనాని
* రాష్ట్ర రహదారులు మృత్యుద్వారాలుగా మారాయని వెల్లడి * అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా తయారయ్యాయని వ్యాఖ్య
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (ట్విట్టర్ ఫోటో)
Janasena Chief Pawan Kalyan: ఏపీలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయని జనసేనాని ఆరోపించారు. జేఎస్‌పీ ఫర్ ఏపీ రోడ్స్ హ్యాష్ ట్యాగ్ పేరిట రెండున్నర కోట్ల మందికి రాష్ట్ర రోడ్ల దుస్థితి తెలిసిందన్నారు. మూడు రోజుల పాటు చేపట్టిన ఈ ఉద్యమానికి 6.2 లక్షలకు పైగా ట్వీట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని రహదారులు అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా తయారై ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాడైన రోడ్లను బాగు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని జనసేనాని కోరారు.