జిఎన్ రావు కమిటీలో లోపాలు ఉన్నాయి.. చర్చిస్తాం: పవన్ కళ్యాణ్

ఏపీకి మూడు రాజధానుల అంశంపై కాక రేగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిఎన్ రావు కమిటీని వ్యతిరేకిస్తున్నారు.

Update: 2019-12-21 11:06 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఏపీకి మూడు రాజధానుల అంశంపై కాక రేగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిఎన్ రావు కమిటీని వ్యతిరేకిస్తున్నారు. ఈ కమిటీలో లోపాలు ఉన్నాయని.. దీనిపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అంతేకాదు అమరావతి ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే అమరావతి రైతులకు జనసేన సంకీభావం తెలిపింది. జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్, నాగబాబు శుక్రవారం అమరావతి ప్రాంతానికి వెళ్లి రైతులతో సమావేశం అయ్యారు.

కాగా ఏపీకి మూడు బహుశా మూడు రాజధానులు అవసరమవుతాయేమోనని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు అటూ ఇటుగానే శుక్రవారం జిఎన్ రావు కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో నాలుగు రీజియన్లు వాటిలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ రీజియన్లుగా రాష్ట్రాన్ని విభజించాలని అభిప్రాయపడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉత్తర కోస్తా రీజియన్‌లో ఉండాలని. మధ్య కోస్తా ప్రాంతంలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు ఉండాలని.. దక్షిణ కోస్తా రీజియన్‌లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండాలని.. ఇక కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు రాయలసీమ రీజియన్‌లో ఉండాలని సూచించింది..

అంతేకాదు రాజధానికి సంబంధించిన ఫంక్షన్స్ మూడు ప్రాంతాల్లో ఉండాలని కమిటీ నివేదికలో పొందుపరిచారు. అందులో భాగంగా మరావతి ప్రాంతంలో అసెంబ్లీ, రాజ్‌భవన్, మినిస్టర్స్, అధికారుల క్వార్టర్లు, హైకోర్టు బెంచ్‌ ఉండాలని సూచించారు. ఇప్పుడున్న అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్‌గా ఉండాలని.. ఇక విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్‌, వేసవి అసెంబ్లీ సమావేశాలు, హైకోర్టు బెంచ్ తోపాటు కీలకమైన సచివాలయంను ఏర్పాటు చెయ్యాలని సూచించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు జ్యూడిషియల్ కేపిటల్‌గా అక్కడ హైకోర్టు, దాని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయాలని జిఎన్ రావు కమిటీ సూచించింది.

Tags:    

Similar News