Janasena: ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన కసరత్తు

Janasena: ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో దాదాపు 15 స్థానాలపై దృష్టి

Update: 2024-02-27 05:48 GMT

Janasena: ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన కసరత్తు

Janasena: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై గట్టి కసరత్తు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం 24 స్థానాలకు ఒప్పందం కుదిరినా.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోనే దాదాపు 15 స్థానాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జనసేనకు ఉత్తరాంధ్రపై జనసేనకు ఉన్న పట్టు కారణంగానే.. కేవలం దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లోనే 9 సీట్ల నుంచి జనసేన బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి రెండు స్థానాలు.. రాయలసీమ నుంచి 3 స్థానాలు కావాలని జనసేన అడినట్టు తెలుస్తుంది. కృష్ణాలో విజయవాడ వెస్ట్‌, అవనిగడ్డ, గుంటూరు పశ్చిమ లేదా తూర్పు, ప్రకాశంలో దర్శి , గిద్దలూరు లేదా చీరాల కావాలని అడిగినట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తం రాయలసీమ నుంచి చిత్తూరులో తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తిల్లో ఏవైనా రెండు సీట్లు కావాలని.. అనంతపురంలో ధర్మవరం స్థానం ఇవ్వాలని గట్టిగానే అడుతున్నట్టు శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే.. టీడీపీతోనే జనసేన పొత్తు కుదిరినా.. ఏ ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందనే ఆసక్తి నెలకొంది. తొలిజాబితా విడుదల రోజు టీడీపీ పోటీ స్థానాలను చంద్రబాబు ప్రకటించినా.. జనసేన మాత్రం పూర్తి స్థాయిలో తన జాబితాను ప్రకటించలేదు.. ఈ నేపథ్యంలోనే తుదిజాబితా వెలువడే సమయానికి మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయని శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News