TDP-Janasena JAC: నేడు జనసేన-టిడిపి జేఏసి సమావేశం... ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ

TDP-Janasena JAC: నిరుద్యోగ సమస్య,రోడ్లు, పేదల గృహ నిర్మాణంలో అవకతవకలపై కార్యాచరణ

Update: 2023-11-09 05:15 GMT

TDP-Janasena JAC: నేడు జనసేన-టిడిపి జేఏసి సమావేశం... ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ

TDP-Janasena JAC: నేడు అమరావతితో ఉదయం 11గంటలకు టీడీపీ- జనసేన జేఏసీ సమావేశం జరగనుంది. నారా లోకేష్, జేఏసీలోని 12 మంది సభ్యులు హాజరుకానున్నారు. ఉమ్మడి మేనిఫోస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. నియోజకవర్గం స్థాయిలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై నియోజకవర్గ స్థాయి పోరాటాలపై జేఏసీ నిర్ణయం తీసుకోనున్నారు. నిరుద్యోగ సమస్య,రోడ్లు, పేదల గృహ నిర్మాణంలో అవకతవకలపై పోరాటలకు జేఏసీ కార్యాచరణ రూపొందించనుంది.

Tags:    

Similar News