ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష విరమణ

Update: 2020-10-18 02:57 GMT

రాజమహేంద్రవరం ఏపీ పేపరుమిల్లులో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం, వారి కోర్కెల సాధన కోసం కాపు కార్పొరేషన్‌ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. అంతేకాదు ఈ దీక్ష విజయవంతమైంది కూడా. రాజా దీక్షకు యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల రెగ్యులరైజేషన్‌ డిమాండ్‌ కు యాజమాన్యం తలొగ్గింది. రాజమహేంద్రవరం ఏపీ పేపరుమిల్లులో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయాల్సి ఉండగా ఇంతవరకూ చేయలేదని.. అందుకు నిరసనగా ఎమ్మెల్యే రాజా దీక్షకు దిగారు.. రాజాతో పాటు సీఐటీయూ నాయకులు కూడా సంఘీభావంగా దీక్షలో కూర్చుకున్నారు.

ఈ క్రమంలో మిల్లు యాజమాన్యం తరఫున జీఎం సూరారెడ్డి, జయకృష్ణ, కార్మిక శాఖ తరఫున ఎం.రామారావు, శ్రీనివాస్ లు ఎమ్మెల్యే రాజాతో చర్చలు జరిపారు.. రాజా పెట్టిన షరతులకు యాజమాన్యం ఒకే చెప్పింది. 50 ఏళ్లు దాటిన వారిని రెగ్యులరైజ్‌ చేయడం, మహిళలను విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించారు. దీంతో జక్కంపూడి రాజాకు ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.

Tags:    

Similar News