East Godavari: జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్వాకం
East Godavari Govt Teachers: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రిటైర్మెంట్ ఫంక్షన్
Representational Image
East Godavari: ఒక పక్కన కరోనా విజృంభిస్తుంటే.. మరో పక్కన కరోనాపై జనాలకు అవగాహన కల్పించాల్సిన టీచర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. అంతేకాదు.. కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాంతో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్వాకం బయటపడింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ ఫంక్షన్‌ను నిర్వహించారు. దాంతో కరోనా సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
గతేడాది పదవీ విరమణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులను స్కూల్ ఆవరణలో సన్మానించారు.. వందలాది మంది విద్యార్థుల సమక్షంలో కనీసం మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిండ్రులు మండిపడుతున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు.