జగనన్న గోరు ముద్ద రుచిగా ఉంది : మంత్రి తానేటి వనిత

ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు్న్న పథకం జగనన్న గోరు ముద్ద అని మంత్రి తానేటి వనిత అన్నారు.

Update: 2020-02-11 14:40 GMT
Minister Tanenti Vanita

ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు్న్న పథకం జగనన్న గోరు ముద్ద అని మంత్రి తానేటి వనిత అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్ధేశ్యంతో సీఎం జగన్ ఈ పథకాన్ని తెచ్చారని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న గోరు ముద్ద" పథకం అమలుపై మంత్రి తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో కలిసి గోరు ముద్ద మెనూను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో ఆకస్మిక తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అమ్మ వంట లాగే చాలా రుచిగా ఉందని కితాబిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేదల పిల్లలు ఉంటారని, ఆహారంలో పోషకాహార లోపం లేకుండా ఓ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం మెనూను రూపొందించిందని అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15 ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కోసం అమ్మ ఒడి లబ్ధిదారుల నుంచి వెయ్యి రూపాయలు సహాయంగా ఇవ్వమని కోరామన్నారు. ప్రతిపక్షం రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి దుస్తువులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఇస్తామని మంత్రి తానేటి వనిత తెలిపారు.

 

Tags:    

Similar News