CM Jagan: దూకుడు పెంచిన వైసీపీ నేతలు.. త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్న జగన్
CM Jagan: మొక్కుబడి నిరసనలతో కాలం వెళ్లదీస్తున్న టీడీపీ
CM Jagan: దూకుడు పెంచిన వైసీపీ నేతలు.. త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్న జగన్
CM Jagan: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్ దూకుడు పెంచారు. ప్రత్యర్థుల ఊహలకు అందని విధంగా ముందుకు వెళుతున్నారు. వై నాట్ 175 విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై తనకేమీ సంబంధంలేదని, అప్పుడు తాను దేశంలోనే లేనని ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నారు. జగన్ ప్రచారంలోను, 52 నెలల పాలనలో తాను చేసేందేమిటో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.
వైసీపీ దూసుకుపోతుంటే, టీడీపీ, జనసేనలు డిఫెన్స్ లో పడ్డాయి. మొక్కుబడి నిరసనలతో కాలం వెళ్లదీస్తున్నారు టీడీపీ నేతలు. ప్రజా సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు బయటపడతారా లేదా అనే చర్చలకు మాత్రమే పరిమితమవుతున్నారు. చంద్రబాబు బయటపడతారా..? లేదా అనే చర్చలకు మాత్రమే పరిమితమవుతున్నారు. జనసేనతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా... ఇప్పటి వరకూ ఆ దిశగా ముందడుగు పడలేదు.