Jagan Tour: ఇవాళ విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్
* శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని దర్శించుకోనున్న సీఎం
ఇవాళ విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్(ఫోటో- ది హన్స్ ఇండియా)
Jagan Tour: సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. సీఎం జగన్ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి 10.30కి ఆశ్రమానికి చేరుకుంటారు. 10.50 వరకూ ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు. 11.30 గంటలకు ఆయన నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు. ఇదిలా ఉండగా ఆశ్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎం భద్రతాధికారులు, ఇతర పోలీస్ అధికారులు చూసుకున్నారు.