చంద్రబాబు హయాంలో ఐదు శాతం రుణాలిచ్చి..గొప్పగా చేశామంటున్నారు: సీఎం జగన్‌

Update: 2019-07-12 04:40 GMT

ఐదు శాతం రుణాలిచ్చి రైతులకు వడ్డీలేని రుణాలిచ్చినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వడ్డీలేని రుణాలపై నిన్నటి చర్చను కొనసాగించిన సీఎం జగన్ ఐదేళ్ల చంద్రబాబు హయాంలో వడ్డీలేని రుణాలపై ఆధారాలతో సహా లెక్కలు చెప్పారు. 2014-15లో 1186 కోట్లు కట్టాల్సి ఉంటే 44.31 కోట్లు చెల్లించి గొప్పగా చేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2015-16లో 2238 కోట్లు కట్టాల్సి ఉంటే 31 కోట్లు చెల్లించారని 2016-17లో 2354 కోట్లు కట్టాల్సి ఉంటే 249 కోట్లు, 2017-18లో 2703 కోట్లు కట్టాల్సి ఉంటే 182 కోట్లు చెల్లించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. 2018-19లో 3069 కట్టాల్సి ఉంటే 122 కోట్లు చెల్లించారని తెలిపారు. ఐదేళ్లలో 11,595 కోట్లు కట్టాల్సి ఉంటే కేవలం 630 కోట్లు చెల్లించి గొప్పగా చేశామంటున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. 

Tags:    

Similar News