వరదలొచ్చినా సీమ ప్రాజెక్టులు నిండలేదు: జగన్

Update: 2019-09-12 10:24 GMT

వరదజలాలొచ్చినా సీమ ప్రాజెక్టులు నిండకపోవడంపై ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వరద జలాలు ఎక్కువగా వచ్చాయని అయినా ప్రాజెక్టుల్లో నీరు నిండకపోవడం విచిత్రంగా ఉందన్నారు..ఇరిగేషన్ శాఖ అధికారులతో జగన్ సమీక్షా సమావేశం జరిపారు. రానున్న కాలంలో 30రోజుల్లోనే ప్రాజెక్టులు నింపే పరిస్థితులు రావాలని ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని సూచించారు. వరద జలాలపై ఇప్పుడున్న అంచనాలను సవరించాలన్నారు.. వెలుగొండ ప్రాజెక్టుపైనా, గుంటూరు ఛానెల్ పొడిగింపుపైనా, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసం పైనా జగన్ అధికారులతో కలసి చర్చించారు. సీమ ప్రాజెక్టులకు ఆశించిన నీటిని తీసుకు వెళ్లలేక పోయామని జగన్ విచారం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News