ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ అభివృద్ధిపై జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి...

Update: 2019-09-13 14:52 GMT

ఏపిలో పట్టణ అభివృద్ధిపై జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాభివృద్ది ప్రాజక్టులపై అధ్యయణానికి నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. 6 వారల్లోగా ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ కమిటీ రాజధాని అమరావతిపై అధ్యయనం చేయనుండటంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.

పట్టణ ప్రణాళిక రంగంలో నిపుణలతో కూడిన సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీ మోహన్, ప్రొఫెసర్ శివానంద స్వామి, ప్రొఫెసర్ కెటీ రవీంద్రనాద్, డాక్టర్ కెవి అరుణాచలం సభ్యులుగా వుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎన్ రావ్ నిపుణుల కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పర్యావరణం, ముంపు నివారణలో నిపుణులైన ఒకరిని కో ఆప్షన్ మెంబర్‌గా తీసుకోనున్నారు. 6 వారాల్లోగా ఈ కమిటీ నివేదకను ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంటుంది.

ఈ కమిటీ చేయాల్సిన అధ్యయనంలో రాజధాని అమరావతిని కూడా చేర్చడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది.ప్యారిస్ లాంటి రాజధాని అవసరమా అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఇప్పటికే ప్రశ్నించారు. ఇటీవల సింగపూర్‌లో బుగ్గన అక్కడి విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి నిధులు లేవన్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో రాజధాని నిర్మాణంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అధ్యాయన కమిటీ వేయడంతో ప్రభుత్వం ఏం చేయబోతోందన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూపొ్ందిచిన విజన్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌ను జగన్ ప్రభుత్వం అమలు చేయదన్నది జగమెరిగిన సత్యం.

జగన్ విజన్ రాజధాని ఏ విధంగా ఉండబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి అమరావతి నిర్మణంపై నిర్ణయం తీసుకొనే అవకాశం వుంది. ఇంతవరకు జరిగిన నిర్మాణాలను ఏం చేయబోతున్నారు ? మధ్యలో ఆగిన నిర్మాణాల పరిస్థితి ఏమిటి ? అన్నవిషయం పై నిపుణుల కమిటీ నివేదికలో తమ అభిప్రాయం తెలుపనుంది. తాజాగా పట్టణ మౌళిక సదుపాయల అభివృద్ధి కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 6 వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నిధులను ఏ ఏ పట్టణాల అభివృద్దికి కేటాయించాలన్న అంశం కూడా నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి వుంటుంది. వీరి సూచనల మీరకు ఈ నిధులు ఖర్చు పెట్టే అవకాశం వుంది.

Tags:    

Similar News