సీఎస్‌ బదిలీపై ఐవైఆర్ కృష్ణారావు స్పందన

Update: 2019-11-05 02:44 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యంను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంకు ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. సీఎస్ బదిలీపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.'ఎల్వీ సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా బదిలీ చేయడం దురదృష్టకరమన్నఆయన సీఎస్ ను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా గానీ, ఇలా జరిగివుండాల్సింది కాదు. హిందూ దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తులను ఉద్యోగాల నుంచి తప్పించినందుకు ప్రతిఫలంగానే సీఎస్ ను బదిలీ చేసిందా అని భావించాల్సి ఉంటుందా..బాధ్యత లేకుండా అధికారం చెలాయించే సీఎం కార్యాలయం ముఖ్యమంత్రుల మెడకు ఉచ్చులా మారుతోందని' కృష్ణారావు పేర్కొన్నారు.

Tags:    

Similar News