ISRO: నవంబర్ 2న ఇస్రో మరో ప్రయోగం ...శ్రీహరి కోట నుంచి LVM3-M5 రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బాహుబలి ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం.
ISRO: నవంబర్ 2న ఇస్రో మరో ప్రయోగం ...శ్రీహరి కోట నుంచి LVM3-M5 రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బాహుబలి ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. సుమారు 4.4 టన్నులు బరువు కలిగిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ 4.4 శాటిలైట్ ను రోదసిలోకి పంపేందుకు చకచకా ఏర్పాటు చేస్తోంది.
ఇస్రో LVM-M5 రాకెట్‌ద్వారా CMS-02 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. నవంబర్ 2న సాయంత్రం 5.26 నిమిషాలకు ప్రయోగించేందుకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో అంతా సిద్ధం చేశారు. ప్రయోగానికి 26 గంటల ముందు అంటే నవంబర్ 1న సాయంత్రం 3.26 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రయోగంలో 4,400 కిలోల బరువున్న CMS-03 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించనున్నారు.
రాకెట్ ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లోనే పూర్తి చేసేలా డిజైన్ చేశారు. 43.5 మీటర్ల పొడవు కలిగిన LVM-3 రాకెట్ , 642 టన్నుల బరువుతో భూమి నుంచి నింగిలోకి పయనం కానుంది. 4,400 కిలోల బరువు కలిగిన CMS-03 ఉపగ్రహాన్ని భూమికి దూరంగా 29,970 కిలోమీటర్లు, భూమికి దగ్గరగా 170 కిలోమీటర్ల ఎత్తులో జియో ట్రన్సఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. ఉపగ్రహాల నియంత్రణ కేంద్రమైన హసన్‌లోని శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండిస్తారు. దశల వారీగా మూడు నాలుగు విడతల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష‌్యలో ప్రవేశ పెడుతారు. భారత్ సహా విశాలమైన సముద్ర ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలు అందించడం కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.