రేపటి నుంచి కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

మండలంలోని కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసిన వారికి సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

S. Srikanth
Published on: 24 Nov 2019 1:33 PM IST
రేపటి నుంచి కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు
X
ఎంపీడీవో యాదగిరి శ్వరరావు

నాతవరం: మండలంలోని కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసిన వారికి సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో యాదగిరి శ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా 25న బీసీ కార్పొరేషన్ రుణాల కోసం 26న ఎస్సీ అభ్యర్థులకు 27న ఎస్టీ, మైనార్టీ, ఇతర కులాల వారికి ఇంటర్వ్యూలు జరుపుతామన్నారు. అభ్యర్థులంతా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు, ఒక జత జిరాక్సు కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story