హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌ను ప్రశ్నించిన మోదీ
హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు
హిమాలయాలకు వెళ్తున్నారా?: పవన్‌ను ప్రశ్నించిన మోదీ
హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. వేదికపై ఎన్ డీ ఏ పక్షాల నాయకులతో మోదీ పలకరించుకుంటూ వెళ్తున్నారు.
ఈ సమయంలో వేదికపై పవన్ కళ్యాణ్ ను ఆయన పలకరించారు. పవన్ కళ్యాణ్ దీక్షా వస్త్రాల్లో కన్పించారు. దక్షిణ భారతంలోని ఆలయాల సందర్శన సమయంలో ధరించిన వస్త్రాల్లోనే ఆయన ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను చూసిన మోదీ హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ ప్రశ్నించారు. తాను చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని ఆయన మోదీకి సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు.
తనతో ప్రధాని ఎప్పుడూ మాట్లాడినా సరదాగా మాట్లాడుతుంటారని ఆయన చెప్పారు. హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. ఎక్కడికి వెళ్లడం లేదని తాను మోదీకి చెప్పానని పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ ,జనసేన కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ఈ కూటమికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు.గురువారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధులపై చర్చించారు.