అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు..

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడంపై తెలుగురాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఆర్టీసీ హౌస్ లో ఈ సమావేశం జరుగుతోంది.

Update: 2020-06-18 07:28 GMT

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడంపై తెలుగురాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఆర్టీసీ హౌస్ లో ఈ సమావేశం జరుగుతోంది. బస్సులు ఎప్పటినుంచి నడపాలి అనేదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే ఏపీనుంచి కర్ణాటకకు బస్సులను తిప్పుతున్న ఏపీ ప్రభుత్వం..

ఇటు తెలంగాణకు కూడా నడపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ చర్చలు పది రోజుల కిందటే జరగాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. తాజా భేటీతో బస్సులు నడపడంపై స్పష్టత రానుంది. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి , అక్కడినుంచి తెలంగాణకు బస్సులు తిరుగుతాయని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News