ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

Dowleswaram: ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులు

Update: 2022-07-16 03:21 GMT

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

Dowleswaram: ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులు కాగా వరద ప్రవాహం 25 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు వరద ప్రవా‍‍హాన్ని అధికారులు విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ వరద ఎఫెక్ట్ 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై పడనుంది. అంబేద్కర్ కోనసీమలో 21 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో 4 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం పడే ఛాన్స్ ఉంది.

దీంతో సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాల్లో వరద ప్రభావం ఉండగా మరో 177 గ్రామాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు వరద ఉధృతం దృష్ట్యా అదనపు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 62 వేల 337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదిలా ఉంటే గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టుల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

Tags:    

Similar News