Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా ఘనారంభం.. బాలా త్రిపుర సుందరీ అలంకరణలో దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి పర్వతంపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పది రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Dasara: ఇంద్రకీలాద్రిపై దసరా ఘనారంభం.. బాలా త్రిపుర సుందరీ అలంకరణలో దుర్గమ్మ దర్శనం
విజయవాడ: ఇంద్రకీలాద్రి పర్వతంపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పది రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ ఆరాధనీయంగా దర్శనమిచ్చారు. రెండో రోజు నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకు దర్శనార్థం అవకాశం కల్పించనున్నారు.
సెప్టెంబర్ 29న మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులను కటాక్షించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 3.30 గంటల నుండి 4.30 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని, రాష్ట్ర ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ఏర్పాట్లు చేశారు.