Srisailam: శ్రీశైలం జలాశయంలో పెరిగిన నీటిమట్టం

Srisailam: వారం రోజుల్లో 5 అడుగులు పెరిగిన నీటిమట్టం * ఆగస్టు మొదటి వారం నాటికి శ్రీశైలం డ్యామ్‌ నిండుకునే అవకాశం

Update: 2021-06-14 09:07 GMT

శ్రీశైలం జలాశయం (ఫైల్ ఇమేజ్)

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. వారం రోజుల్లో 5 అడుగుల నీటి మట్టం పెరిగింది. ఎగువనున్న జూరాల జలాశయంలోని విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసి ఈ నీటిని దిగువనున్న శ్రీశైలం జలాశయానికి 10, 693 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఇలానే కొనసాగితే ఆగస్టు మొదటి వారం నాటికి శ్రీశైలం డ్యామ్‌ నిండుకుండాను తలపించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Tags:    

Similar News