విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది.

Update: 2019-12-23 06:01 GMT
విశాఖ ఏజెన్సీ

నర్సీపట్నం: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు.

ఏజెన్సీలోని మినుములూరులో 11 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈ ప్రాంతలను చూసేందుకు వేల మంది వివిధ ప్రాంతలనుండి తరలి రావడం జరుగుతుంది. పర్యటకులు ఇక్కడ పడుతున్న మంచును చూసి ఆనందభరితులౌతున్నారు.

Tags:    

Similar News