Andhra Pradesh: ఉరవకొండ మండలంలో అమ్మ ఒడి తొలి విడతలో 10,992 మంది అర్హులు

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి 15,000 వేల రూపాయలు ప్రోత్సాహకం అందించే జగనన్న అమ్మ ఒడి పథకంకు మండల విద్యాశాఖ తొలి జాబితాను విడుదల చేసింది.

Update: 2019-12-30 05:15 GMT

ఉరవకొండ: పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి 15,000 వేల రూపాయలు ప్రోత్సాహకం అందించే జగనన్న అమ్మ ఒడి పథకంకు ఉరవకొండ మండలంలో 10,992 మంది విద్యార్థులను అర్హులుగా పరిగణిస్తూ మండల విద్యాశాఖ తొలి జాబితాను విడుదల చేసింది.

ఉరవకొండ మండలానికి చెందినవారై ఉండి స్థానికంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకొంటున్న విద్యార్థులు 13,729 మంది ఉన్నారని గుర్తించిన అధికారులు ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా వడపోత నిర్వహించి 1,948 విద్యార్థుల కుటుంబాలు ఈ పథకానికి అర్హులుకారని తేల్చి 789 మంది విద్యార్థుల కుటుంబాల వివరాలు పునః పరిశీంచాలని నిర్ణయించారు. అయితే ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులున్నా అందులో కేవలం ఒక విద్యార్థిని మాత్రమే పథకంలో అర్హులుగా పరిగణించి ఆ విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జనవరి 9న పథకం ప్రారంభోత్సవం రోజు ప్రోత్సాహకాన్ని జమ చేయనున్నారు.

Tags:    

Similar News