సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్తంగా జనవరి 8న జరుగు సమ్మె ను జయప్రదం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు మరుకుర్తి ఏసు పిలుపునిచ్చారు.

Update: 2019-12-26 10:12 GMT
ఐ ఎఫ్ టి యు నాయకులు

జగ్గంపేట: దేశవ్యాప్తంగా జనవరి 8న జరుగు సమ్మె ను జయప్రదం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు మరుకుర్తి ఏసు పిలుపునిచ్చారు. స్థానిక స్టాలిన్ భవన్లో గురువారం ఫోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసు మాట్లాడుతూ జనవరి 8న జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. అలాగే కార్మిక చట్టాల సవరణ ఆపాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కంటింజెంట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి అన్నారు.

కనీస వేతనం 21,000 రూపాయలు, డి ఏ ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేయాలని,అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలని ,ఉపాధి కల్పన, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల నుంచి వేతనాలు పెంచాలన్నారు. అలాగే కొత్త ఉద్యోగాల పేరుతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిని తొలగించ రాదని ,రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అధిక ధరలు అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జోజి, సహాయ కార్యదర్శి జి ఆది నారాయణ ,కురసం లక్ష్మి, చిట్టిబాబు, సత్తిబాబు , భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News