ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా iDream వ్యవస్థాపకుడు

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) వైస్-చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్‌గా idream వ్యవస్థాపకుడు చిన్నా వాసుదేవరెడ్డిని ప్రభుత్వం నియమించింది.

Update: 2020-04-11 01:53 GMT
Vasudeva Reddy

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) వైస్-చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్‌గా idream వ్యవస్థాపకుడు చిన్నా వాసుదేవరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

వాస్తవానికి ఏపీ కంటెంట్ కార్పోరేషన్‌ గా ఉన్న ఈ సంస్థను ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌గా పేరు మార్చి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జీవోలో ఉత్తర్వ్యూలను పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగంలో అగ్రగ్రామిగా ఉన్న వాసుదేవరెడ్డి సేవలు అవసరమని భావించిన ఏపీ ప్రభుత్వం వాసుదేవరెడ్డి నియామకానికి ఆమోదముద్రవేసింది.

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వాసుదేవరెడ్డి న్యూయార్క్ లో స్థిరపడ్డారు. ఏడేళ్ల కిందట ఐ డ్రీమ్ మీడియా సంస్థలు స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాసుదేవరెడ్డి సన్నిహితుడు, 2009 లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ప్రజారాజ్యం తరుపున మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అంతేకాదు రక్తచరిత్ర సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు.


Tags:    

Similar News