మూడు రాజధానులకు పూర్తి మద్దతు : జనసేన ఎమ్మెల్యే రాపాక

Update: 2020-01-20 12:04 GMT
మూడు రాజధానులకు పూర్తి మద్దతు : జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి సాధ్యమన్నారు. జగన్ వయస్సు చిన్నదైనా ఎంతో విజన్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారని రాపాక తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ వేదికగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. ఇలాంటి ఉన్నతమైన నిర్ణయం ఉన్నతమైన వ్యక్తులకే వస్తాయని సీఎం జగన్‌ను కొనియాడారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతీ దాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం భావ్యం కాదన్నారు. ప్రజాభిప్రాయం కూడా మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే రాపాక చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News