తిరుమలలో మళ్లీ కొనసాగుతున్న రద్దీ.. సర్వదర్శనానికి 40 గంటల సమయం
Tirumala: శిలాతోరణం వరకు సర్వదర్శన క్యూలైన్.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,223 మంది భక్తులు
తిరుమలలో మళ్లీ కొనసాగుతున్న రద్దీ.. సర్వదర్శనానికి 40 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. భక్తులు పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకూ భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక సోమవారం వేంకటేశుడిని 83వేల 223 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36వేల 658 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీకి 4.73 కోట్ల ఆదాయం వచ్చింది.