AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష
AP High Court: నెలరోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు
AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష
AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు షాక్ నెల రోజుల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయాల జరిమానా విధించింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని ఆక్రమించుకుని ఎలాంటి లీజు చెల్లించకుండా స్కూల్ నడిపిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే యడవలివారి సత్రానికి 25 లక్షల రూపాయాలు చెల్లించాలని ఏపీ హైకోర్టు గతంలో ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.