తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సుమన్
Tirumala: పట్టు వస్త్రంతో సత్కరించిన ఆలయ అధికారులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సుమన్
Tirumala: తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు హీరో సుమన్. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో సుమన్ తన స్నేహితులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. సుమన్‌కు రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 16న కన్నడలో తన సినిమా విడుదలవుతుందని సుమన్ తెలిపారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సుమన్ తెలిపారు.