Viral News: పదే పదే కరుస్తున్న పాములు.. బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న 'సుబ్రహ్మణ్యం..' మరి పరిష్కరమేంటి?

Update: 2025-03-18 07:03 GMT

Viral news: మనుషులు పగ పట్టడం చూసి ఉంటాం..కానీ పాములు కూడా పగపడతాయని పెద్దలు చెబుతుంటారు. కొన్ని సందర్బాల్లో అదే నిజం అనిపిస్తుంది. ఎంతలా అంటే ఒకటి లేదా రెండు సార్లు మరీ భిన్నంగా అంటే 5లోపు మరీ ఆశ్చర్యంగా ఉన్నది అంటే 10 సార్లు కానీ 103 సార్లు పాము కాటుకు గురైతూనే ఉన్నాడంటే అతను ఏ జన్మలో ఏం పాపం చేశాడో ఎవరికీ తెలియదు. అంతలా పాములు పగ పట్టాయి. ఇది ఒక అంతు చిక్కని అద్బుతమనే చెప్పవచ్చు. దీని వెనకున్న రహస్యం ఏంటో తెలుసుకుంనేందుకు ఆ కుటుంబ తిరగరాని చోటు అంటూ లేదు. మొక్కని దేవుడు లేడు. ఆ కుటుంబంలో అతన్నే వెంటాడుతున్నాయి పాములు. ఒంటరిగా కనపడితే చాలు శరీరంలో ఒక్కడో ఒకచోట కాటు పడాల్సిందే.

అందుకే అతన్ని విడవకుండా అతని భార్య కాపాలా కాస్తుంది. కొన్ని ఏళ్లుగా నెలకు , రెండు నెలలకు ఒకసారి పాము కాటు వేస్తూనే ఉంది. పగపట్టిన పాముకు గురైన వ్యక్తి పేరు సుబ్రమణ్యం. అతనికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుబ్రమణ్యంకు తల్లి కూడా ఉంది.  కొన్నేళ్లుగా నెలకొన్న సమస్య అందరికీ తెలుసు కానీ ఎవరు ముందుకు రాలేదు. బంధువులు తోడుకారు. రోజంతా కుటుంబమే కూలి చేస్తే కడుపు నిండుతుంది. లేకుంటే పస్తులు ఉండాల్సిందే. అప్పులు చేయడం చికిత్స ఖర్చు చేయడం. కొన్నిఏళ్లుగా ఇలా 103 సార్లు పాము కాటుకు గురవ్వడంతో ఉన్న 3ఎకరాల పొలం కూడా అమ్ముకున్నాడు.

20ఏళ్ల వయసులో తొలిసారి పాము కరించింది. వైద్యం చేయించుకుని బయటపడ్డారు. అప్పటి నుంచి ఏటా పలుమార్లు పాము కాటుకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. పాముల భయంతో పదేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ, మట్టి పనులు చేశారు. అక్కడ కూడా పాములు వదల్లేదు. వైద్యం చేయించుకుని బతికాడు. భయాందోళనలతో అక్కడి నుంచి తిరిగి స్వగ్రామానికి చేరుకుని స్థానిక కోళ్ల పరిశ్రమలో పనికి చేరాడు. అప్పుడప్పుడూ పొలం పనులకు వెళ్తున్నాడు. రెండు రోజుల కిందట ఊరి సమీపంలో పనులు చేస్తుండగా మళ్లీ పాముకరిచింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పింది. తరచూ పాములు కురుస్తుండటంతో వైద్య ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తుందని సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ వాపోయారు. 

Tags:    

Similar News