బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

*మరింత బలపడుతున్న అల్పపీడనం, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే ఆవకాశం

Update: 2022-08-08 04:00 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 

Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం మరింత బలపడనుంది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే ఆవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. 48 గంటల్లో ఛత్తీస్ గడ్, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురువనున్నాయి. గంటకు తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News