శ్రీశైలంలో భారీ వర్షం.. వసతి గృహాలకే పరిమితమైన భక్తులు

Srisailam: కారుపై విరిగిపడ్డ చెట్టు

Update: 2023-04-30 13:47 GMT

శ్రీశైలంలో భారీ వర్షం.. వసతి గృహాలకే పరిమితమైన భక్తులు

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలంలో వర్షం దంచికొట్టింది. శ్రీశైలం, సున్నిపెంటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్ష ధాటికి సున్నిపెంటలో ప్రధాన వీధులన్ని జలమయం అయ్యాయి. వర్షంకారణంగా శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతిగృహాలకు పరిమితమయ్యారు. మరోపక్క శ్రీశైలంలో శ్రీగిరికాలనీ ,కొత్తపేటలో బురద, ఎర్రమట్టి నీళ్లు దిగువకు కొట్టుకొస్తున్నాయి. వర్షం ధాటికి చెట్టు నెలకొరిగింది. ఉమా రామలింగేశ్వర సత్రం రోడ్డులో కారుపై చెట్టు విరిగి పడింది. కారు డ్రైవర్ సురక్షితంగా బయపడ్డాడు.

Tags:    

Similar News