ఉరుముల మెరుపులతో వర్షాలు

Update: 2019-04-22 02:15 GMT

ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పాడి, దాని నుంచి కర్నాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ, కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పెరుపులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 11, విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో 6, మెంటాడలో 5, బొబ్బిలి, సీతానగరం, ప్రకాశం జిల్లా పొదిలిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

Similar News