కడప జిల్లాలో వరద బీభత్సం.. అన్నమయ్య ప్రాజెక్ట్‌కు పొటెత్తిన వరద
*వరద తాకిడికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్ వే *చెయ్యెరు నదిలోకి భారీగా వరద ప్రవాహం
అన్నమయ్య ప్రాజెక్ట్‌కు పొటెత్తిన వరద(ఫోటో - ది హన్స్ ఇండియా)
Heavy Rains: కడప జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎగువున ఫించా ప్రాజెక్ట్ నుంచి అన్నమయ్య ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద తాకిడికి అన్నమయ్య ప్రాజెక్ట్ సమీపంలో మట్టికట్ట కొట్టుకుపోయింది. అటు చెయ్యెరు నదిలోకి భారీగా వరద ప్రవాహం పొట్టెత్తింది.
రాజంపేట, నందలూరు, కులపూత్తురు, మందపల్లి, గండ్లూరు, పాటూరుతో పలు గ్రామాలు మునిగాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి కొండపైకి ఎక్కారు. మరోవైపు పులపత్తూరు శివాలయం పూజారి రవి సొదరుడి శశి కుటుంబ సభ్యులు నదిలో కొట్టుకుపొయారు. రక్షించే చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.