గత మూడు రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు భారీగా వరద

*11 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల *నిండుకుండలా మారిన చిత్రావతి *ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Update: 2021-11-19 05:00 GMT

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు భారీగా వరద(ఫైల్ ఫోటో)

Chitravathi Balancing Reservoir: అనంతపురం జిల్లా పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తివేసి 11 వేల క్యూసెక్కుల నీటిని చిత్రావతి నది లోకి అధికారులు విడుదల చేశారు.

గత మూడు రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నదిలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో చిత్రావతి రిజర్వాయర్ నిండుకుండలా కనిపిస్తోంది.

చిత్రావతి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చిత్రావతి నదిలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో తిమ్మంపల్లి పులివెందుల రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News