AP High Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
AP High Court: 2018లో సవరణ వచ్చింది, కానీ ఈనేరం అంతకుముందే జరిగింది
AP High Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.. సీఐడీ తరపున న్యాయవాది మిథున్ రస్తోగి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టై కేవలం 10 రోజులు మాత్రమే అయినందునా.. ఈ పిటిషన్‌ను ఇప్పుడు స్వీకరించాల్సిన సమయం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 900 పేజీల డాక్యుమెంట్‌ను కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో..దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఉద్దేశపూర్వకంగా.. పథకం ప్రకారం ఈ కుంభకోణానికి తెర తీసి..ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారన్నారు సీఐడీ తరపు లాయర్ మిథున్ రస్తోగి.