విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ విచారణ
Chandrababu: ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు ఎంక్వైరీ
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ విచారణ
Chandrababu: చంద్రబాబు కేసుల వ్యవహారంలో ఇవాళ ఏసీబీ కోర్టులో ఆయన తరపు లాయర్లు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఎంక్వైరీ జరుగనుంది. మరో అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సీఐడీ తెలిపింది. పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా నేడు ఒకేసారి వాదనలు ఏసీబీ కోర్టులో కొనసాగనున్నాయి. మరో వైపు చంద్రబాబుపై పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లపై ఇవాళే విచారణ చేస్తామన్నారు ఏసీబీ న్యాయమూర్తి.
మరో వైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ విచారణకు రావాలన్న నోటీసులపై.. మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరుగనుంది.