Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ
Chandrababu: ఏసీబీ కోర్టులో నేడు కొనసాగనున్న వాదనలు
Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ
Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో బెయిల్.. కస్టడీ పిటిషన్‌లపై రెండు రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. లంచ్ బ్రేక్ తర్వాత ఏఏజీ పొన్నవోలు వాదనలు విన్పించనున్నారు. ఇరువురు వాదనల అనంతరం నేడు తీర్పు వెలువరించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.