మూగజీవాలను హింసించడం నేరం: ఎస్సై చిన్నరెడ్డెప్ప

ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని గ్రామాల్లో పశువుల పందేలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై చిన్నరెడ్డప్ప గ్రామస్తులను హెచ్చరించారు.

Update: 2019-12-29 08:15 GMT
ఎస్సై చిన్నరెడ్డప్ప

చంద్రగిరి: ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని గ్రామాల్లో పశువుల పందేలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై చిన్నరెడ్డప్ప గ్రామస్తులను హెచ్చరించారు. సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో పశువుల పందేలను నిర్వహించేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు . ఈ క్రమంలో మండల పరిధిలోని కొత్తశాన బట్ల, పాతశానంబట్ల గ్రామంలో పోలీసులు పశువుల పందేలు నిషేదమంటూ కరపత్రాలను గోడలకు అతికించడంతో పాటు మైకుల ద్వారా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్, సీఐ రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరుష పందేలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుంతోందన్నారు.

అనారికంగా ఇలాంటి ఆటలను ప్రోత్సహించి, పాల్గొనడం ఎంత మాత్రం సమంజసం కాదని, గ్రామ పెద్దలు గ్రామ శ్రేయస్సు కోరుకుంటూ తాత్కాలిక ఆటవిక ఆనందం కోసం మూగజీవాలను హింసించడం మానుకోవాలన్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగను రక్తతర్పణాలతో, హింసాత్మకంగా కాకుండా, ప్రతి ఒక్కరూ ఈ ఆటవిక ఆటను స్వచ్చందంగా బహిష్కరించాలని ఆయన కోరారు. ఇలాంటి ఆటలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహిస్తే, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గణేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News