తిరుమలలో అన్యమత ప్రచారం?

Update: 2019-08-22 14:34 GMT

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందా? గుట్టు చప్పుడు కాకుండా అలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో భక్తుల్లో ఈ అయోమయం కనిపిస్తోంది. తిరుమల వెంకన్న సన్నిధిలో సైలెంట్ గా అన్యమత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. తిరుమల బస్ టిక్కెట్ వెనుకాల జరుసలేం యాత్ర హజ్ యాత్రకు ఏర్పాట్లంటూ ముద్రించడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలనుంచి, తిరుపతి వెళ్లడానికి తిరుమలలోని ఆర్టీసీ బస్సు టిక్కెట్ కౌంటర్ లో ఈ టిక్కెట్లు విక్రయిస్తున్నారు. తిరుమల టిక్కెట్ వెనకాల జరుసలేం యాత్ర, హజ్ యాత్ర పైనా వివరాలుండటం కలకలం రేపుతోంది. ఈ టిక్కెట్లన్నీవిజయవాడ కేంద్రంగా ముద్రితమవుతున్నట్లు సమాచారం. తిరుమల వెంకన్న కోట్లాది మంది కొలిచే ఆరాధ్య దైవం అలాంటిది ఈ టిక్కెట్లపై అందుకు విరుద్ధంగా అన్యమత ప్రచారం ఎందుకు జరుగుతోందన్న ఆందోళన భక్తుల్లో కనిపిస్తోంది. కలనైనా తిరుమల కొండపై అన్యమత ప్రచారాన్ని, గానీ అన్యమత దైవాన్ని కానీ ఊహించుకోలేని భక్తులకు ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది.

Full View

Tags:    

Similar News