గుంటూరులో కలకలం: గులియన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
Guillain-Barré Syndrome: గులియన్ బారీ సిండ్రోమ్ జీబీ సిండ్రోమ్ బాధితులు ఏడుగురు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
గుంటూరులో కలకలం: గులియన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
Guillain-Barré Syndrome: గులియన్ బారీ సిండ్రోమ్ జీబీ సిండ్రోమ్ బాధితులు ఏడుగురు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరొకరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఐదుగురు సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధితో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు మరణించారు.
గులియన్ బారీ సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్టర్. రోగ నిరోధక శక్తి బలహీనంగా న్నవారికి ఇది సోకుతోంది. ఈ వ్యాధితో బాధపడేవారు పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి ద్వారా ఈ సిండ్రోమ్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
గులియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి?
ఈ వ్యాధి సోకితే కండరాల బలహీనత వస్తోంది. సాధారణంగా కాళ్లలో ప్రారంభమై ఇది శరీరానికి చేరుతుంది.
తరచుగా కాలి, వేళల్లో తిమ్మిరి, జలదరింపు లక్షణాలు కన్పిస్తాయి.
కండరాల బలహీనత కారణంగా నడవడం కష్టం.
నమలడం, మాట్లాడడం లేదా మింగడానికి కూడా ఇబ్బంది కలుగుతోంది.
మూత్ర విసర్జన లేదా ప్రేగు కదలికలకు నియంత్రించడంలో ఇబ్బంది కలుగుతోంది.
అన్ని వయస్సులున్న రోగులు ఈ వ్యాధి బారినపడుతున్నారు. వేడి నీటిని తాగడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. నిల్వ చేసిన పాలను తాగడం వల్ల కూడా ఇది వ్యాపిస్తోంది. ప్లాస్మా పెరిసిస్ ద్వారా చికిత్స చేయవచ్చు. ఈ వ్యాధి సోకితే తొలుత నాడీ వ్యవస్థై ప్రభావం చూపిస్తోంది. వైరల్ ఇన్ ఫెక్షన్ తగ్గిన తర్వాత ఇది సోకుతోంది.