Gudivada Amarnath: పవన్ ఓ రాజకీయ ఉగ్రవాది
Gudivada Amarnath: పవన్ ఉద్దేశపూర్వకంగానే ఉత్తరాంధ్రకు విరోధిగా మారుతున్నారు
Gudivada Amarnath: పవన్ ఓ రాజకీయ ఉగ్రవాది
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన ఓ పొలిటికల్ టెర్రిస్టు అన్న మంత్రి.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విరోధిగా మారారన్నారు. కేవలం చంద్రబాబు దత్తత పుత్రుడిగా ఆయన చెప్పిన టాస్క్ పూర్తి చేయాలన్న ఇంటెన్షన్ తో ముందుకు వెళ్తున్నారన్నారు. బాధ్యతగత రాజకీయ పార్టీ అధినేతగా వైజాగ్ ఏయిర్ పోర్టు ఘటనను ఖండించాల్సింది పోయి.. దాడిని సమర్ధిస్తూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నటీ నటులు వస్తే, జనాలు వస్తారు.. కానీ వారే ఓట్లేస్తారనుకుంటే.. భంగపాటు తప్పదన్నారు. ఓసారి భంగపడినా ఆ విషయం పవన్ కు బోధపడటం లేదన్నారు. ప్రజాభీష్టం మేరకు తమ ప్రభుత్వ మూడు రాజధానులంటుంటే.. మూడు పెళ్లిళ్ల విషయం ప్రస్తావనకు తేవడం సిగ్గుచేటన్నారు. సినిమాల్లో మాదిరిగా అహంభావంతో పవన్ వ్యవహరిస్తున్నాడు కాబట్టే ఆ పార్టీ నేతలు కూడా అలాగే ఉన్నారని సెటైర్ వేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.