Palnadu: డీఎస్ఏ స్టేడియంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
Palnadu: సంబురాల్లో పాల్గొన్న అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు
Palnadu: డీఎస్ఏ స్టేడియంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో కలెక్టర్ శివశంకర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పాటలకు డ్యాన్సులు చేశారు. ప్రభుత్వ తరపున నిర్వహిస్తోన్న ఈ వేడుకలకు విద్యార్థులు కూడా హాజరయ్యారు. మూడ్రోజుల పాటు జరగనున్న సంక్రాంతి సంబురాల్లో ప్రజలందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.